భారత సరిహద్దుల వద్ద చైనా గ్రామం

ఢోక్లాంకు 9 కిలోమీటర్ల ఆవల నిర్మించిన డ్రాగన్​ దేశం

By udayam on November 20th / 1:45 pm IST

భారత్​తో 2017లో సరిహద్ధు వివాదం నెలకొన్న ఢోక్లాంకు అతి సమీపంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించడం ఇప్పుడు ఉద్రిక్తతలకు తావిస్తోంది.

ఢోక్లాంకు సరిగ్గా 9 కిలోమీటర్లు భూటాన్​కు 2 కిలోమీటర్ల దూరంలో చైనా నిర్మించిన ఈ పాంగ్డా అనే గ్రామం చైనా కుటిల బుద్ది అయిన ‘సలామి స్లైస్​’లో భాగంగా నిర్మించినట్లు అధికారులు భావిస్తున్నారు.

దీనికి సంబంధించిన చైనాకు చెందిన సిజిటిఎన్​ న్యూస్​ గురువారం పలు చిత్రాలను విడుదల చేసి అనంతరం వాటిని తన ట్విట్టర్​ ఖాతా నుంచి తొలగించింది.

దీంతో భూటాన్​ సరిహద్దుల వద్ద సైతం కాపలా కాసే మన సైనికులు మరింత అప్రమత్తమయ్యారు.