గాల్వాన్ ఘర్షణ వీడియో విడుదల చేసిన చైనా

By udayam on February 20th / 1:10 pm IST

గతేడాది భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియోను చైనా విడుదల చేసింది.

చైనా అధికార వార్తా పత్రిక గ్లోబల్​ టైమ్స్​ విడుదల చేసిన ఈ వీడియోలో చైనా సైనికులు, భారత సైనికులు ఉద్రిక్త పరిస్థితుల్లో ఎదురెదురుగా ఉండడం కనిపిస్తోంది.

కారకోరం పర్వత శ్రేణుల్లో ఇరు వైపులా సైనికులు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో పాటు పాంగాంగ్​ సరస్సు వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వీడియోలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.

ఈ ఘర్షణల్లో భారత్​ వైపు నుంచి 20 మంది సైనికులు మరణించగా, చైనా తమ వైపు 5 గురు సైనికులే మరణించినట్లు చెప్పుకొంటోంది.

తాజాగా లడఖ్​ వేదికగా భారత, చైనా సైనిక అధికారుల మధ్య పదో విడత కమాండర్​ స్థాయి చర్చలు జరుగుతుండగా ఈ వీడియోను రిలీజ్​ చేయడం ఆర్మీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్​
Source: deccanchronicle