చైనాలో కరోనా సునామీ.. రోజుకు 3.7 కోట్ల కేసులు!

By udayam on December 24th / 5:41 am IST

కరోనా పుట్టినిల్లు చైనాలో రోజుకు 3.7 కోట్ల కొవిడ్​ కేసులు నమోదవ్వనున్నట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​ అంచనా వేసింది. డిసెంబర్​ నెల తొలి 20 రోజుల్లో దేశవ్యాప్తంగా 24.8 కోట్ల మంది జనాభాకు కొవిడ్​ సోకినట్లు తెలిపింది. అంటే మొత్తం చైనా జనాభాలో 18 శాతం మందికి కొవిడ్​ ఉన్నట్లే! త్వరలోనే ఈ సంఖ్య రోజుకు 3.7 కోట్ల స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ అంతర్గత సమావేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. 2023 జనవరిలో రోజుకు 4 కోట్ల మందికి కొవిడ్​ సోకుతుందని చైనా భావిస్తోంది.

ట్యాగ్స్​