చైనాలో చెలరేగిపోతున్న కొవిడ్.. అక్కడ విపరీతంగా వ్యాపిస్తోంది. జనవరి 13 నాటికి ఆ దేశంలో రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని లండన్ కు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ఏప్రిల్ చివరి నాటికి ఆ దేశంలో కొవిడ్ కారణంగా 1.7 లక్షల మంది మరణిస్తారని పేర్కొంది. వచ్చే పదిరోజుల్లో కొవిడ్ మరణాల సంఖ్య కూడా చైనాలో రోజుకు 25 వేలుగా ఉండనుందని తెలిపింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఆ దేశ వ్యాప్తంగా కరోనాతో 5.84 లక్షల మంది మరణిస్తారని పేర్కొంది.