చైనా సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో జీవశాస్త్ర ప్రయోగాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. భారరహిత స్థితిలో పునరుత్పాదకత ఎంతవరకు సాధ్యమనే ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం త్వరలో అంతరిక్షంలోకి కోతులను పంపించనున్నట్లు తెలిపారు. అక్కడ వాటి పెరుగుదల, పిల్లలను కనే అవకాశం ఎంతవరకు ఉందనేది పరీక్షించనున్నట్లు వివరించారు. అంతరిక్ష ప్రయోగాలకు నేతృత్వం వహించే చైనా శాస్త్రవేత్త జాంగ్ లూ ఈ వివరాలను వెల్లడించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది.