చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న చైనా ల్యాండర్ అక్కడ నీటి జాడను కనిపెట్టింది. 2008లో భారత చంద్రయాన్ ఉపగ్రహం తొలిసారిగా చంద్రుని ఉపరితలంపై నీటి జాడల్ని కనిపెట్టగా.. 2009లో అమెరికా మిషన్లు చంద్రుని మీద నీటి జాడల్ని మ్యాపింగ్ చేశారు. అయితే చంద్రుని మీద ఉన్న ల్యాండర్లు ఏవీ ఈ విషయాన్ని ఇప్పటి వరకూ నిర్ధారించలేదు. చైనాకు చెందిన ఛాంగ్ ఈ–5 ల్యాండర్ నే ఈ నీటి జాడల్ని గుర్తించిన తొలి ల్యాండర్గా రికార్డు సృష్టించింది.