చంద్రుడిపై నీటిని కనుగొన్న చైనా రోవర్​

By udayam on January 10th / 12:43 pm IST

చందమామ అవతలి వైపు (ఎప్పుడూ చీకటిగా ఉండి మనకు కనిపించని వైపు) పరిశోధనలు జరుపుతున్న చైనా ల్యాండర్​ అక్కడి మట్టి, శిలల్లో నీటి జాడను కనిపెట్టింది. చాంగే–5 ల్యాండర్​ ఉన్న ప్రాంతంలో 120 పీపీఎం మేర నీరు ఉందని తేల్చింది. ఇక్కడే ఉన్న కొన్ని శిలల్లో 180 పీపీఎం మేర నీటి జాడ ఉందని ప్రకటించింది. ఇప్పటికే చందమామపై నీటి జాడను భారత్​తో సహా అమెరికాకు చెందిన శాటిలైట్లు గుర్తించాయి. అయితే జాబిల్లి ఉపరితలంపై మట్టిని పరిశీలించి నీటి జాడ కనిపెట్టడం ఇదే ప్రథమం.

ట్యాగ్స్​