చైనాను కమ్మేస్తున్న కరోనా

By udayam on November 25th / 5:07 am IST

కరోనా పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తోంది. జీరో కొవిడ్​ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఈ వైరస్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఈ దేశంలో 31,444 కొత్త కొవిడ్​ కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్​ 13న 29,317 కేసులు రావడమే 2022లో చైనాలో వచ్చిన అత్యధిక కేసులు. దీంతో చైనా తిరిగి లాక్​ డౌన్​ లకు పనిచెబుతోంది. చైనాలో ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువుగా ఉండడం కూడా ఈ వైరస్​ వ్యాప్తికి దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్​