60 ఏళ్ళలో తొలిసారి : చైనాలో తగ్గుతున్న జనాభా

By udayam on January 18th / 6:16 am IST

తమ దేశ జనాభా గత 60 ఏళ్లలో తొలిసారిగా తగ్గుముఖం పట్టిందని చైనా స్వయంగా ప్రకటించింది. పోయిన ఏడాది(2022)లో చైనా దేశ జనాభా సుమారు 8.50 లక్షలు తగ్గి 141.175 కోట్లుగా నమోదైంది. 2021లో ఇది 141.260 కోట్లుగా ఉంది. జననాల రేటు ప్రతి 1,000 మందికి 6.77గా నమోదైంది. 2021లో జననాల రేటు 7.52గా ఉంది. చైనా జననాల రేటు కొన్నేళ్లుగా క్షీణిస్తోంది. ఈ ధోరణి తగ్గించడానికి ఒకరినే కనాలనే విధానాన్ని 2016లో రద్దు చేసింది. 2021లో అమెరికాలో ప్రతి 1,000 మందికి 11.06 జననాలు, బ్రిటన్‌లో 10.08 జననాలు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్న భారతదేశంలో అదే ఏడాది జననాల రేటు 16.42గా రికార్డ్ అయింది.

ట్యాగ్స్​