వీడియో : కెనడా ప్రధానిపై జిన్​ పింగ్​ అసహనం

By udayam on November 17th / 11:58 am IST

ఇండొనేసియాలోని బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు వేదిక వద్ద చైనా అధ్యక్షుడు షీ జిన్​ పింగ్​.. కెనడా అధ్యక్షుడిపై బుసలు కొట్టాడు. వేదిక నుంచి కిందకు దిగుతున్న క్రమంలో.. జిన్​ పింగ్​.. ట్రుడోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందట ఇదే వేదిక వద్ద తమ ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలను మీడియాకు లీక్ చేశారని ట్రూడోపై జిన్‌పింగ్ ఆరోపణ చేశారు.అలా లీక్ చేయటం సరికాదని, ట్రూడోలో ‘నిజాయితీ’ లోపించిందని జిన్‌పింగ్ తప్పుపట్టారు. మనం చర్చించుకున్నదంతా పత్రికలకు లీక్ చేశారు. అది సరికాదు’ అని జిన్‌పింగ్ మండారిన్‌లో ట్రూడోతో అన్నారు.దీనిపై ట్రుడో మాత్రం నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ‘మా దేశంలో మేం ఏ విషయం పైనైనా బహిరంగ చర్చలకు వెళ్తాం. మేం స్వేచ్ఛాయుతంగా ఉంటాం’ అని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ట్యాగ్స్​