బలపడుతున్న రష్యా, చైనా రక్షణ బంధం!

By udayam on December 1st / 11:12 am IST

రష్యా, చైనా బాంబర్‌ విమానాలు పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంపై సంయుక్త గస్తీ విన్యాసాలు చేశాయి. తమ మధ్య బలపడుతున్న రక్షణ బంధాన్ని ప్రదర్శిస్తూ ఈ విన్యాసాలు చేపట్టాయి. రష్యాకు చెందిన టుపొలెవ్‌ 95, చైనా హెచ్‌-6కె బాంబర్‌ విమానాలు జపాన్‌ సముద్రం, తూర్పు చైనా సముద్రాలపై 8 గంటలసేపు విహరించాయి. అయితే రష్యా విమానాలు మొట్టమొదటిసారి చైనాలో దిగడం, చైనా విమానాలు తొలిసారి రష్యాలోని వైమానిక స్థావరానికి వెళ్లడం విశేషం. తమ సంయుక్త విన్యాసాలు ఏ దేశానికీ వ్యతిరేకం కావని రష్యా రక్షణ శాఖ ప్రకటించినా ఉక్రెయిన్‌, తైవాన్‌ సమస్యలపై అమెరికాతో ఈ రెండు దేశాలకూ ఉద్రిక్తతలు పెరుగుతుండడం గమనార్హం.

ట్యాగ్స్​