భారత్​కు ముంచెత్తిన చైనా ఫోన్లు

2020లో 77 శాతం ఫోన్లు అక్కడి నుంచే వచ్చాయట

By udayam on January 28th / 1:39 pm IST

గతేడాది లాక్​డౌన్​ సమయంలోనూ భారత్​కు చైనా నుంచి మొబైల్​ ఫోన్లు అధిక సంఖ్యలో దిగుమతి అయినట్లు కనలైజ్​ అనే సంస్థ వెల్లడించింది.

లఢఖ్​ ప్రాంతంలో చైనా, భారత్​ సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, చైనా వస్తువులపై బ్యాన్​ వేయాలన్న డిమాండ్​ పెరిగినప్పటికీ వీటి దిగుమతుల్లో తగ్గుదల ఏమీ కనిపించలేదని ఆ సంస్థ పేర్కొంది.

గతేడాది మన దేశం దిగుమతి చేసుకున్న స్మార్ట్​ఫోన్లలో చైనా నుంచి వచ్చినవే 77 శాతం అని ఆ సంస్థ తెలిపింది. గతేడాది మొదటి రెండు త్రైమాసికాల కంటే మూడో త్రైమాసికంలో వీటి దిగుమతులు రెండింతలు అయినట్లు పేర్కొంది.

Canalys estimates, January 2021 - India smartphone shipments, Q1 2018 - Q4 2020

ఏ సంస్థ ఎన్ని దిగుమతులు చేసుకున్నాయంటే?

నాలుగో త్రైమాసికంలో షియామీ సంస్థ 12 మిలియన్​ స్మార్ట్​ఫోన్లను దిగుమతి చేసుకుని తన వాటాను 27 శాతానికి పెంచుకుందని పేర్కొంది. అనంతరం సామ్​సంగ్​ 9.2 మిలియన్​ ఫోన్లతో 21 శాతానికి, వివో 7.7, ఒప్పో 5.5 మిలియన్ల ఫోన్లను దిగుమతి చేసుకున్నాయని తెలిపింది.