చైనా: చేపలు, పీత లకూ కొవిడ్ టెస్టులు

By udayam on August 19th / 5:12 am IST

చైనాలోని సముద్ర తీర నగరం షియామెన్‌లో 40 కరోనావైరస్ కేసులను గుర్తించటంతో.. నగరంలోని 50 లక్షల మందికి కోవిడ్ టెస్టులు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం ప్రజలు మాత్రమే కాదు.. కొన్ని రకాల సముద్రజీవులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారిక నోటీసు పేర్కొంది. సముద్రం మీద వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చినపుడు.. వారికి, వారు చేపలు, జలచరాలకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని షియామెన్ జిమే మారిటైమ్ పాండమిక్ కంట్రోల్ కమిటీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఫలితంగా.. బతికున్న చేపలు, పీతలకు కోవిడ్ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న వీడియోలు చైనా సోషల్ మీడియా వేదిక డోయిన్‌లో వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్​