చైనా మిలటరీ విమానం.. అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానానికి అత్యంత సమీపంగా కేవలం 20 అడుగుల దూరానికి చేరుకున్న ఘటన ఈనెల 21న జరిగింది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ ఎయిర్ స్పేస్ వద్ద ఈ ఘటన జరిగినట్లు అమెరికా మిలటరీ గురువారం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్.సి.–135 యుద్ధ విమానానికి కేవలం 6 మీటర్ల దూరంలోకి చైనా నేవీ కి చెందిన జె–11 జెట్ దూసుకొచ్చిందని తెలిపింది. తైవాన్ కు సమీపంలో ఈ భారీ ప్రమాదం తప్పిందని తెలిపింది.