అరుణ గ్రహం మొత్తాన్ని ఫొటోలు తీసిన చైనా

By udayam on June 30th / 7:36 am IST

చైనాకు చెందిన తియానవెన్​ 1 శాటిలైట్​ అరుణ గ్రహం మొత్తాన్ని ఫొటోల్లో బంధించింది. 2021 ఫిబ్రవరిలో ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన ఈ ఉపగ్రహం ఆపై ఓ రోబోటిక్​ రోవర్​ను సైతం అరుణ గ్రహ ఉపరితలం పైకి నీటి జాడల్ని కనిపెట్టేందుకు పంపించింది. చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం విడుదల చేసిన ఫొటోల్లో అరుణ గ్రహం అందాలు కన్నుల విందుగా ఉన్నాయి. యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ 2018లో అక్కడి దక్షిణ ధృవం మంచు పలకల కింద నీటి జాడను అందరి కంటే ముందు కనిపెట్టింది.

ట్యాగ్స్​