ఈ సంక్రాంతికి వెండితెర సందడి అప్పుడే మొదలై పోయింది! గత మూడేళ్ల నుంచి కరోనా నిబంధనల కారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు అంతగా రాలేదు. దాంతో చిన్న చిత్రాల మధ్య పండగలు గడిచిపోయాయి. అయితే ఈ సంక్రాంతికి థియేటర్లలో రెండు డబ్బింగ్ సినిమాలు, మూడు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ ఈసారి సందడి చేయనున్నాయి. 40 ఏళ్ళలో ఈ హీరోల సినిమాలు దాదాపు 17 సార్లు పోటీ పడ్డాయి. కొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధిస్తే.. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధించారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత వీరి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.