కైకాల మృతిపై చిరంజీవి ఎమోషనల్​ పోస్ట్​

By udayam on December 23rd / 6:55 am IST

నవరస నటసార్వభౌముడు, తెలుగు సినీ ప్రపంచంలో ధృవతార కైకాల సత్యనారాయణ మృతి పట్ల మెగాస్టార్​ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. సుదీర్ఘ పోస్ట్​ ను ట్వీట్​ చేశారు. ఆయనతో నటించడం తన అదృష్టమన్న చిరంజీవి.. ఆయన స్ఫటికం లాంటి మనిషి అని కీర్తించారు. ఎలాంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆయనకు నటన, మంచి రుచికరమైన భోజనం.. ఈ రెండే అత్యంత ప్రీతిపాత్రమని చెప్పారు.

ట్యాగ్స్​