వాల్తేరు వీరయ్య నుంచి మరో క్రేజీ సాంగ్ కు రంగం సిద్ధమైంది. ఈసారి మాస్, ఊరమాస్ కలిపి చిందేయనున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవితో పాటు రవితేజ కూడా అలరించనున్నారు. చాలాకాలం తర్వాత వీరిద్దరినీ ఒకే సినిమాలో చూస్తుండడం, వీరికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తోడవ్వడంతో ఈ పాటపై క్రేజ్ మామూలుగా లేదు. దీనికి తగ్గట్టే పాట కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఈ సాంగ్ ను శుక్రవారం లాంచ్ చేయనున్నారు.
MEGASTAR × MASS MAHARAJA = #PoonakaaluLoading ❤️🔥
Song out tomorrow 💥#WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th pic.twitter.com/F0nZJAvIpn
— Mythri Movie Makers (@MythriOfficial) December 29, 2022