చిరంజీవి : జనసేనకే నా మద్దతు

By udayam on October 4th / 10:14 am IST

రాజకీయాల పరంగా తన మద్దతు తమ్ముడు పవన్​ కళ్యాణ్​ పార్టీ జనసేనకే ఎప్పుడూ ఉంటుందని మెగాస్టార్​ చిరంజీవి స్పష్టం చేశారు. గాడ్​ఫాదర్​ రిలీజ్​ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన ‘ఈ మూవీలో తాను చెప్పిన రాజకీయ డైలాగులు ఎవరినీ ఉద్దేశించి చెప్పినవి కావు. లూసీఫర్​ నేపధ్యంలో రాసుకున్నవే. ఇక్కడ వాళ్ళు భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేను. నిస్వార్ధంగా ప్రజల కోసం నిలబడే నా తమ్ముడు పవన్​ కళ్యాణ్​కు, అతడి పార్టీ జన సేన కే నా సంపూర్ణ మద్దతు’ అని కుండబద్దలు కొట్టారు.

ట్యాగ్స్​