చిరంజీవి: ఇండస్ట్రీ పెద్దరికం నాకొద్దు

By udayam on December 29th / 12:03 pm IST

ఇండస్ట్రీలో పెద్దరికం చెలాయించాలన్న ఉద్దేశం తనకు లేదని, తనకు ఎలాంటి కుర్చీలూ వద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇండస్ట్రీ పెద్దరికం తనకొద్దని తేల్చిచెప్పారు. కొందరు చిన్నవాళ్లమని చెప్పుకుంటూ తనను పెద్ద చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన సినీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, సినీ వర్కర్స్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్​