మెగాస్టార్ చిరంజీవి ఈరోజు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 65 ఏళ్ళ చిరంజీవి ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ బారిన పడ్డానని చెప్పారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న ఆయన ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య మూవీల్లో నటిస్తున్నారు.