టిక్కెట్ల ధరలపై మళ్ళీ ఆలోచించండి : చిరంజీవి

By udayam on November 25th / 11:02 am IST

లక్షలాది మంది సినీ కార్మికులు ఆధారపడ్డ పరిశ్రమలో టిక్కెట్ల ధరలను తగ్గించడంపై మరోసారి ప్రభుత్వం ఆలోచన చేయాలని మెగాస్టార్​ చిరంజీవి ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్​లో పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్​లైన్​ టికెటింగ్​ తేవడం హర్షణీయమన్నారు. అయితే బతుకు తెరువు కోసం టికెట్​ ధరలను కాలానుగణంగా. అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మరింత మేలు కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రోత్సాహాలు ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్​