‘ఆచార్య’ కోసం మెగాస్టార్ సిద్ధం

By udayam on November 20th / 2:15 pm IST

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకొంటున్న ‘ఆచార్య’కు మెగాస్టార్​ పూర్తిగా సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 9 నుంచి షూటింగ్​లో పాల్గొనాలని ప్లాన్​ చేసుకున్న చిరంజీవికి అప్పుడు జరిగిన కరోనా టెస్ట్​లో పాజిటివ్​గా తప్పుడు నివేదిక వచ్చింది.

దాంతో తిరిగి టెస్టులు జరిపితే అక్కడ నెగిటివ్​ వచ్చినా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆచార్య యూనిట్​ చిరంజీవి సీన్లు కాకుండా మిగతా తారాగణంతో షూటింగ్​ను కొద్ది కొద్దిగా పూర్తి చేశారు.

తా.జాగా ఓటీటీ వేదిక ‘ఆహా’ కోసం సమంత హోస్ట్‌గా చేస్తున్న ‘సామ్‌ జామ్‌’ షోకు చిరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరలోనే ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నటుడు సోనూ సూద్‌, ప్రతినాయకులుగా నటిస్తున్న కొందరిపై దర్శకుడు కొరటాల శివ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.