ఇటీవల ఆచార్యతో నిరాశపరిచిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి మాత్రం విందు భోజనం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. నెల రోజుల అమెరికా, యూరప్ ట్రిప్‌లో ఉన్న ఆయన తిరిగొచ్చిన తర్వాత తన మేకోవర్‌లో భారీ మార్పులు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓ ట్రైనర్‌ను కూడా సెట్ చేసిన ఆయన టీం.. కొత్త సినిమాలో లుక్ కోసం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారని సమాచారం. దీంతో పాటు భోళాశంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య మూవీల కోసం కొత్త మేకోవర్నూ ట్రై చేస్తారట.