చిరంజీవి: పవన్‌ ఎదైనా అనుకుంటే చేస్తాడు

By udayam on November 21st / 11:06 am IST

పవన్‌ కళ్యాణ్‌ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిరంజీవి నరసాపూర్‌లో శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్‌ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ‘నేను జీవితంలో అనుకున్నవన్నీ చేశా కానీ ఒక్క దాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో రాణించాలంటే చాలా కటువుగా, మొరటుగా ఉండాలి. సున్నితంగా ఉండకూడదు. మాటలు అన్నా అనకపోయినా అనాలి అనిపించుకోవాలి. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా..? అని అనిపించిందన్నాడు. పవన్‌ కల్యాణ్‌ పేరు వినగానే రాజకీయాలకు పవన్‌ కల్యాణ్‌ తగినవాడు. పవన్‌ కల్యాణ్‌ మాటలు అంటాడు పడతాడు. ఏదో రోజు మీరందరి ఆశీస్సులతో ఉన్నత స్థానంలో ఉంటాడు’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​