వాల్తేరు వీరయ్య: 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్​ లోకి

By udayam on January 18th / 4:57 am IST

వింటేజ్​ చిరంజీవిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్​ బాబీ మూవీ వాల్టేరు వీరయ్య అప్పుడే రూ.100 కోట్ల క్లబ్​ లోకి చేరిపోయింది. మంగళవారం రాత్రికి ఈ మూవీ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లకు చేరుకున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు . జనవరి 13న విడుదలైన ఈ మూవీ తొలిరోజు రూ.33 కోట్ల భారీ కలెక్షన్లు సాధించింది. జనవరి 17న అంటే 5వ రోజున ఈ మూవీకి రూ.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. చిరంజీవి గ్రేస్​ కు, రవితేజ మాస్​ తోడై ఈ మూవీని బ్లాక్​ బస్టర్​ గా నిలిపింది.

ట్యాగ్స్​