మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్యను కూడా సంక్రాంతి రోజునే బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. మెగాస్టార్ గత చిత్రం గాడ్ ఫాదర్ కూడా అక్టోబర్ 5న బాలీవుడ్ లో రిలీజై ఓ మోస్తరుగా ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రవితేజ, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్ లు నటిస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకుడు.