కెజిఎఫ్​ చూసి.. బ్యాంక్​ను దోచుకోబోయి..

By udayam on June 3rd / 6:57 am IST

కెజిఎఫ్​ మూవీని చూసి ఓ బ్యాంకుకు కన్నం వేద్దామని ప్రయత్నించిన 8 మంది బృందం పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఎపిలోని చిత్తూరు జిల్లాలో నిన్న జరిగిన ఈ ఘటనపై పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి. రామకుప్పం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్​ను గత నెల 28 నే దోచుకోవాలని నిందితులు ప్రయత్నించారని, కానీ వారికి చేతకాకపోవడంతో వెనుదిరిగారని తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కార్లు, ఒక గ్యాస్​ సిలిండర్​, గ్యాస్​ కట్టర్​ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​