కర్ణాటకలో చర్చి ధ్వంసం

By udayam on December 28th / 10:29 am IST

కర్ణాటక మైసూరులోని పెరియాపట్నాలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చర్చిలోని బేబీ జీసెస్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రిస్మస్ ముగిసిన 2 రోజుల వ్యవధిలోనే ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోంది. వెనుక గేటును పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. చర్చిలో ఉన్న డబ్బుల్ని దొంగిలించేందుకు దాడి చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్​