మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఆయనపై అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నారాయణను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో తెలంగాణ పోలీసులకు వెల్లడించారు. ఇదే కేసులో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్ పేర్లు సైతం ఉన్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను విచారించనున్నారు. దీంతో పాటు టెన్త్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంలోనూ నారాయణపై ఎఫ్ఐఆర్ ఉంది.