మహారాష్ట్రలోని సిద్ధిలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాత్రంతా జాగారం తప్పలేదు.
ఆయనకు ఏర్పాటు చేసిన విడిది పైన ఉన్న ఓ వాటార్ ట్యాంక్ నిండిపోయి రాత్రంతా వాటర్ బయటకు పోతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
అలా రాత్రి 10.30 నుంచి గంట పాటు నీళ్ళు కారిపోతూ ట్యాంకులు ఖాళీ అయ్యాయి. దాంతో వాష్ రూముల్లో ఉదయం 4.45 గంటల నుంచి నీళ్లు రావడం ఆగిపోయాయి.
దాంతో పాటు ఆయన రూమ్‌లో ఉన్న దోమలు సైతం ఆయనకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. దీంతో ఆయన విడిది చేసిన సర్క్యూట్ హౌస్ సబ్ ఇంజనీర్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.