ఎక్కువ మార్కులు వస్తే హెలికాఫ్టర్​ రైడ్​

By udayam on May 6th / 6:06 am IST

10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెలికాఫ్టర్​లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని ఛత్తీస్​ఘడ్​ సిఎం భూపేష్​ చెప్పారు. విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్న ఆయన గురువారం రాజ్​పూర్​లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాని ఎఎన్​ఐ వార్తా సంస్థ పేర్కొంది. పిల్లలకు విమానంలో ప్రయాణించాలని ఉంటుంది. మంచి మార్కులు సాధించిన వారికి మేం ఆ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.

ట్యాగ్స్​