పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. సోమవారం నరసాపురానికి చేరుకున్న సిఎం అక్కడ రూ.3,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు.అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. వరి కార్తీక సోమవారం రోజున రూ.3,300 కోట్లు ఖర్చయ్యే 15 కార్యక్రమాలకు నరసాపురంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిఎం చెప్పారు.