ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధి

నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్లో సీఎం జగన్

By udayam on February 20th / 10:00 am IST

అమరావతి: కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్ధవంతమైన చర్చ జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

శనివారం.. ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్‌ పద్దతిలో జరిగిన 6వ నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీ అత్యంత ప్రాధాన్యమైందన్నారు. ముఖ్యంగా 5 రకాల అంశాలు తయారీ రంగానికి అవరోధాలుగా మారాయని, రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11 శాతంవడ్డీ చెల్లించాల్సి వస్తోందని, తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతం మించి ఉండటం లేదని’’ సీఎం జగన్ అన్నారు. పనితీరు కనబరుస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. మొత్తం మీద భారత్‌ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని కోరారు.

మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ది ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్దిలో రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు.

ట్యాగ్స్​