ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించారు. కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ ముగిసింది. వీరిద్దరి సమావేశం దాదాపు 40 నిమిషాల సేపు కొనసాగింది. ఈ సందర్భంగా విభజన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ ను కూడా జగన్ కలిశారు. అమిత్ షాతో భేటీ ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తిరుగుపయనమయ్యారు.