రూ.15 వేల కోట్ల పవర్​ ప్రాజెక్ట్​కు జగన్​ శంకుస్థాపన

By udayam on May 17th / 7:24 am IST

ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్​ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలులో ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్​ కో ఎనర్జీస్​ లిమిటెడ్​ ఈ ప్లాంట్​ నిర్మాణాన్ని చేపడుతోంది. వచ్చే 5 ఏళ్ళలో ఈ ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏడాదికి 5,410 మె.వాట్ల విద్యుత్​ ఉత్పత్తి జరగనుంది.

ట్యాగ్స్​