తెలంగాణ లో మళ్లీ టీడీపీ పూర్వ వైభవం తీసుకరావడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. జూ.ఎన్టీఆర్ అభిమానులు ‘నెక్స్ట్ సిఎం ఎన్టీఆర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ కు మద్దతుగా స్లోగన్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించిన ఫ్యాన్స్ సిఎం ఎన్టీఆర్.. సిఎం ఎన్టీఆర్ అంటూ నినదించారు.
Jai NTR 💛🔥
#KhammamTDP @tarak9999 pic.twitter.com/Cd7Vxo19bo
— RUTHEESH (@rutheesh29) December 21, 2022