చాలా కాలంగా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై లు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న పొలిటికల్ విభేదాలను పక్కనపెట్టి చాలాసేపు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి వీరిద్దరూ కలిసి ఆహ్వానం పలికారు. వీరితో పాటు ఐటి మంత్రి కేటిఆర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Reception in #Telangana @rashtrapatibhvn pic.twitter.com/NtqSScIAgB
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 26, 2022