కేసీఆర్​: 3 నెలల్లో సంచలన ప్రకటన

By udayam on May 27th / 7:16 am IST

రాబోయే రెండు లేదా మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సిఎం కేసీఆర్​ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన జరిపిన బెంగళూరు పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సిఎం కుమార స్వామిలతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ దేశంలోని ప్రజలకు మంచినీరు, విద్యుత్​, సాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదని విమర్శించారు. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు రావాలని, అది మా కూటమితో వచ్చి తీరుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్​