దేవగౌడతో కేసీఆర్​ భేటీ

By udayam on May 26th / 11:33 am IST

మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో గురువారం ఈ భేటీ జరిగింది. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్​ అనంతరం దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా దేవె గౌడ ఇంటి పరిసరాల్లో కేసీఆర్ కటౌట్లు కనిపించాయి. హైదరాబాద్​కు వస్తున్న ప్రధానిని కలవకూడదనే కేసీఆర్​ బెంగళూరు వెళ్ళారని తెలంగాణ బిజెపి శ్రేణులు విమర్శించాయి.

ట్యాగ్స్​