తాను తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు బిజెపి నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మల్యే ఈటెల రాజేందర్. దాదాపు 20 ఏళ్ళ టిఆర్ఎస్ లో ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి బిజెపిలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఆయన తిరిగి టిఆర్ఎస్ లోకి చేరతారన్న ప్రచారంతో పాటు.. ఆయనకు కెసిఆర్.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలన్నీ కేసీఆర్ రాజకీయ గేమ్ లో భాగమేనని, తాను తిరిగి టిఆర్ఎస్ లో చేరేదే లేదని పేర్కొన్నారు.