బీహార్ లో కల్తీసారా తాగి మరణిస్తున్న వారి సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఈరోజు మరో 28 మంది సారన్ జిల్లాలో మృత్యువాత పడ్డారు. అయితే ఈ మృతులకు ఎలాంటి నష్ట పరిహాం అందించమని సిఎం నితీష్ కుమార్ మరోసారి చెప్పారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లతో పోల్చితే బీహార్ లో కల్తీ సారాతో మరణిస్తున్న వారి సంఖ్య తక్కువేనని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఈ ఘటనను గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలడంతో పోల్చిన ఆయన ‘మోర్బీనే పేపర్లు ఒక్కరోజు వార్తను చేశాయి. ఈ వార్తెంత?’ అంటూవ్యాఖ్యానించారు.