విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహాసభలో సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అన్న ఆయన రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యమని చంద్రబాబుకు తెలియదన్నారు. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభ కు పంపని ఆయన బీసీలకు పలు హామీలు ఇచ్చి వాటిని విస్మరించారన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, నయవంచనను వారికి గుర్తుచేయండి అంటూ మాట్లాడారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్ ను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.