వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 60 నుంచి 70 మందిని పక్కన పెట్టేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వారందరికీ 2024 సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. వీరిలో చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు ఇప్పటికే టికెట్ ఇవ్వమని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ అధినాయకత్వం మాటలు కూడా పెడచెవిన పెట్టడమే టికెట్ దూరం కావడానికి కారణంగా ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్నారు.