వర్షాల వల్లే బొగ్గు కొరత : మంత్రి

By udayam on October 13th / 4:26 am IST

దేశంలో బొగ్గు నిల్వలపై పూటకో మాట మాట్లాడుతోంది కేంద్రం ప్రభుత్వం. నిన్నటి వరకూ అసలు దేశంలో బొగ్గు కొరత లేదని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనే ప్రధానికి లేఖ రాస్తున్నారన్న కేంద్ర బొగ్గు మంత్రి తాజాగా మాట మార్చారు. మన దేశంతో పాటు పలు దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే బొగ్గు నిల్వల శాతం తగ్గిందని ప్రకటించారు. దాంతో టన్ను బొగ్గు రూ.60 నుంచి రూ.190 కు పెరిగిందని, దాంతో బొగ్గు ఆధారిత పవర్​ ప్లాంట్లు 15–20 రోజులు మూత పడడమో లేదా అతి తక్కువ ఉత్పత్తి చేయడమో చేస్తున్నాయని సెలవిచ్చారు.

ట్యాగ్స్​