ఉత్తర భారతదేశం తీవ్ర చలి గుప్పిట చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఛండీఘర్, హిమాచల్ ప్రదేశ్ లలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు పడిపోయాయి. మరో నలుగు రోజుల పాటు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. పొగ మంచు కమ్మేయడంతో హిమాచల్, ఢిల్లీ, బీహార్, బెంగాల్, సిక్కిం, ఒడిశా, అస్సాం, త్రిపురల్లోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. పలు చోట్ల ట్రైన్లు, విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.