యుపీ : చలి తీవ్రతకు 25 మంది మృతి

By udayam on January 6th / 10:04 am IST

దేశంలోని పలు ప్రాంతాలను చలి పులి వణికిస్తోంది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. తీవ్ర చలి కారణంగా యూపీ కాన్పూర్ లో గురువారం ఒక్క రోజే 25 మంది మృతి చెందారు. వీరంతా చలి ప్రభావం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వీరిలో 17 మంది ఎలాంటి వైద్య సహాయం అందక ముందే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​