ఈడీ ముందుకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

By udayam on November 23rd / 11:16 am IST

తెలంగాణ లో ఈడీ , ఐటీ దాడులు, లిక్కర్ స్కామ్ విచారణ, ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం ఫై సిట్ విచారణ ఇవే కాకుండా నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు ఇలా అన్ని నడుస్తున్నాయి. దీంతో రాజకీయ నేతలు వణికిపోతున్నారు. తాజాగా బుధువారం నేషనల్ హెరాల్డ్ కేసులో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ అంజన్ కుమార్ ఈడీ ముందుకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఆయనను ఈడీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్​