కర్ణాటక అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు విడి సావర్కర్ ఫొటో ఏర్పాటుచేయడంపై కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. అసెంబ్లీలో వివాదాస్పద వ్యక్తి ఫొటోను ఆవిష్కరించాల్సిన అవసరం ఏమిటని కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసింది. అవినీతి, కుంభకోణాలు, రైతు సమస్యలపై చర్చ జరగకుండా చేసేందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధరామయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో చిత్రపటాలు పెట్టడంపై ఎలాంటి చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.