రాహుల్​ ప్రచారం చేసిన చోట డిపాజిట్లు గల్లంతు

By udayam on May 3rd / 8:14 am IST

బెంగాల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రచారం చేసిన రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్ధుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మొత్తంగా ఆ రాష్ట్రంలో 85 శాతం మంది కాంగ్రెస్​ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. 292 స్థానాల్లో వారికి కేవలం 42 చోట్లే డిపాజిట్లు దక్కాయి. మిగతా అన్ని చోట్లా ఘోరంగా దెబ్బతింది కాంగ్రెస్​. మొత్తం పోలైన ఓట్లలో 16.5 శాతం ఓట్లు దక్కకపోతే ఆ అభ్యర్ధికి డిపాజిట్​ గల్లంతైనట్లు ఎన్నికల సంఘం లెక్కగడుతుంది.

ట్యాగ్స్​